Brahmanandam: ఆ కారణంగానే సినిమాలకు దూరంగా ఉన్నా.. బ్రహ్మానందం షాకింగ్ కామెంట్స్
సీనియర్ నటుడు, స్టార్ కమెడీయన్ బ్రహ్మానందం (Brahmananda), అతడి కొడుకు రాజా గౌతమ్ (Raja Gautham)లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’

దిశ, సినిమా: సీనియర్ నటుడు, స్టార్ కమెడీయన్ బ్రహ్మానందం (Brahmananda), అతడి కొడుకు రాజా గౌతమ్ (Raja Gautham)లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) . ఆర్.వి.ఎస్ నిఖిల్ (RVS Nikhil) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి (February) 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ‘బ్రహ్మా ఆనందం’ టీజర్ (Teaser) రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు చిత్ర బృందం. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న మూవీ యూనిట్ సినిమాకు సంబంధించిన పలు విషయాలు షేర్ చేశారు.
ఇందులో భాగంగా ఓ విలేకర్.. ‘ఎందుకు మీరు సినిమాల విషయంలో ఈ మధ్య చాలా సెలక్టీవ్ అయిపోయారు అని బ్రహ్మానందాన్ని ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ.. ‘ఇంతకు ముందు బ్రహ్మానందం కామెడీ బాగుండేది.. ఇప్పుడు చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లే అని ఇంతకు ముందు కమెడీయన్ల దగ్గర మనం విన్నాం ఈ మాట. ఎంత చేసిన ఎక్కడో ఒకచోట ఇంకా ఏదో వెతుకుతూ ఉంటారు. దానికి కారణం వయసు. మన ఏజ్ మనకు తెలియాలి. ఇంతకు ముందు బాగా చేశాము ఇప్పుడు చేయలేకపోతున్నాము అంటే.. మన వయసు పెరిగింది. అది ఒప్పుకోవాలి. కాబట్టి ఇంతకు ముందు చేసినంత యాక్టీవ్‌గా కూడా నేను చెయ్యలేకపోతున్నా అని నాకు తెలుసు. ఎప్పటికి మనం గుర్తిండాలి అంటే కొన్ని మనం తగ్గించుకోవాలి. ఇంతకు ముందు లాగే చేసిన క్యారక్టర్లే చేస్తుంటే మన ఇమేజ్ కూడా తగ్గిపోతుంది. అందుకే సినిమాలు తగ్గించాను కానీ.. నాకు వేశాలు లేక కాదు, ఎవరూ అవకాశాలు ఇవ్వక కాదు. చెయ్యలేక అంతకన్న కాదు’ అంటూ చెప్పుకొచ్చారు.
నాకు వేషాలు లేక కాదు, ఇవ్వక కాదు..
— Filmy Focus (@FilmyFocus) January 16, 2025
చేసిన కామెడీనే చేస్తున్నాడు అనే ఇమేజ్ వద్దనుకుని సినిమాలు చేయడం తగ్గించాను - బ్రహ్మానందం#Brahmanandam pic.twitter.com/OmxbHnEqEv