ఒక్క మాటలో ‘పుష్ప-2’ రివ్యూ చెప్పేసిన బ్రహ్మాజీ.. అవన్నీ చూడొద్దంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్

అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పుష్ప-2’.

Update: 2024-12-05 14:05 GMT

దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ‘పుష్ప-2’. బ్లాక్ బస్టర్ హిట్ పుష్పకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. ఇక ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న పుష్ప-2 ఎట్టకేలకు నేడు విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా చూసిన వారంతా సోషల్ మీడియా ద్వారా రివ్యూలు(Reviews) ఇస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. పలువురు సినీ స్టార్స్ కూడా తమ అభిప్రాయాలను తెలుపుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, టాలీవుడ్ స్టార్ నటుడు బ్రహ్మాజీ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘‘ఈ చిత్రానికి వస్తున్న రివ్యూలు, రేటింగ్స్(Ratings) చూడకండి. వెళ్లి సినిమాను చూసిన ఎంజాయ్ చేయండి. గూస్ బంప్స్ రావడం ఖాయం. అంతేకాకుండా స్టాండింగ్ ఓవియేషన్ కూడా ఇస్తారు’’ అని రాసుకొచ్చారు. కాగా.. డిసెంబర్ 4న ఈ సినిమా బెనిఫిట్ షోలు(Benefit shows) వేయగా విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్(RTC Cross Road) వద్ద తొక్కిసలాట జరగడంతో ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ఇందులో భాగంగా మూవీ టీమ్‌తో పాటు, అల్లు అర్జున్‌పై కేసు నమోదు అయినట్లు సమాచారం.

Read More...

Pushpa-2: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పుష్ప-2 నిర్మాతలు.. ఎందుకో తెలుసా?


Tags:    

Similar News