Boney Kapoor: ‘నటీనటులతో సీక్వెల్ సిద్ధం చేస్తున్నాను’.. ఆ చిత్రంపై హైప్ పెంచుతోన్న నిర్మాత కామెంట్స్
బోనీ కపూర్(Boney Kapoor) నిర్మించిన నో ఎంట్రీ (No entry) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: బోనీ కపూర్(Boney Kapoor) నిర్మించిన నో ఎంట్రీ (No entry) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనిల్ కపూర్(Anil Kapoor), బిపాసాబసు(Bipasabasu), సల్మాన్ ఖాన్(Salman Khan) ముఖ్య పాత్రల్లో నటించగా.. అనీస్ బాజ్మీ(Anees Bazmee) దర్శకత్వం వహించారు. అయితే తాజాగా బోనీ కపూర్ నో ఎంట్రీ మూవీ సీక్వెల్ గురించి మాట్లాడారు. ఈ చిత్రానికి తప్పక సీక్వెల్ ఉంటుందని అన్నారు. నటీనటులతో సీక్వెల్ సిద్ధం చేస్తున్నానని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతేకాదు మూవీ విడుదల డేట్ ను కూడా నిర్ణయించామని.. 2025 అక్టోబరులో దీపావళి(Diwali) కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని బోనీ కపూర్ చెప్పారు.
అలాగే ఇప్పుడు వచ్చే సంవత్సరం జూన్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తామని తెలిపారు. అలాగే షూటింగ్ కంటే ప్రొడక్షన్‌కే టైం ఎక్కువగా పడుతుందని.. ఏదేమైనా మేం అనుకున్న సమయానికి మాత్రం మూవీ రిలీజ్ చేయడానికే ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. రియల్ స్టోరీస్ కంటే.. ఇప్పుడు మేము తెరకెక్కించే సినిమా స్టోరీ చాలా గొప్పగా ఉంటుందని, అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు. స్టోరీ విన్నవాళ్లు కూడా చెప్పారని అన్నారు. కానీ నటీనటుల్నే మార్చాల్సి వస్తుందని.. అందుకు కాస్త బాధగా ఉందని వెల్లడించారు. ఫస్ట్ పార్ట్‌లోని నటించిన నటీనటుల కోసం చాలా కాలం వెయిట్ చేశానని.. కానీ కుదరలేదని పేర్కొన్నారు ఇక వేరే నటీనటులతో సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నామని బోనీ వివరించారు.