ఆ విషయంపై ప్రశ్న.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బాలీవుడ్ ప్రముఖ నటుడు

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్(Bollywood actor Akshay Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్ర

Update: 2024-12-17 13:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్(Bollywood actor Akshay Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ నటుడు హౌస్‌ఫుల్(Housefull) సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీకి తరుణ్ మన్సుఖా(Tarun Mansukha)ని రూపొందిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం వచ్చే ఏడాది(2024) జూన్ 6 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. అలాగే ఈ హీరో నటించిన స్కై ఫోర్స్(Sky Force) మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే అక్షయ్ కుమార్.. బిగ్ ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa)లో గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

అయితే తాజాగా ‘పింటూ కీ పప్పీ’(Pintu Key Puppy) సినిమా ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమానికి హాజరైన ఈ నటుడికి ఓ ప్రశ్న ఎదురైంది. సినిమా షూటింగ్‌లో భాగంగా కంటికి అయిన గాయం గురించి అడగ్గా.. నేను మిమ్మల్ని చూడగలను’ అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. దీంతో అక్కడున్నవారంతా నవ్వసాగారు. అక్షయ్ కుమార్ మాటలను బట్టి చూస్తే కంటి గాయం తగ్గిపోయిందని పరోక్షంగా చెప్పాడని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ నటుడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

Tags:    

Similar News