Baapu Movie OTT : ఓటీటీలోకి తండ్రి సూసైడ్ స్టోరీ..
సీనియర్ నటీనటులు బ్రహ్మాజీ (Brahmaji), ఆమని (Amani) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బాపు’ (Bapu)

దిశ, సినిమా: సీనియర్ నటీనటులు బ్రహ్మాజీ (Brahmaji), ఆమని (Amani) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బాపు’ (Bapu). ఏ ఫాదర్స్ సూసైడ్ స్టోరీ (A Father's Suicide Story) అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ మూవీని నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు దయా (Director Daya) తెరకెక్కించాడు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాజు, సీహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ మూవీలో బలగం సుధాకర్ రెడ్డి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటింటి మెప్పించారు. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బాపు’ చిత్రం ఎమోషనల్ కంటెంట్ (Emotional content)తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ (digital premiere)కు సిద్ధం అయింది. ఈ చిత్రం వచ్చి రెండు వారాలు కూడా కాకుండానే ఓటీటీ (OTT) అనౌన్స్‌మెంట్‌ను పంచుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ ( )లో ఈ చిత్రం మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.