పలుచని చీరలో గార్జియస్ లుక్‌తో దర్శనమిచ్చిన బాలయ్య బ్యూటీ.. షాక్‌లో నెటిజన్లు

ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Update: 2024-12-17 04:44 GMT

దిశ, సినిమా: ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అమ్మడుకి అనుకున్నంత క్రేజ్ రాలేదు. ఇక 2021లో బాలయ్య సరసన ‘అఖండ’(Akhanda) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ ఏడాది ‘ఖేల్ ఖేల్ మే’(Khel Khel Mein) అనే హిందీ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బాలయ్య సరసన ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) సినిమాలో నటిస్తుంది.

అయితే బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘డాకు మహారాజ్’ భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ క్రమంలో.. ప్రగ్యా సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస ఫొటోషూట్స్(Photoshoots) చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా, ప్రగ్యా పలుచని చీర ధరించి ఎద, నడుము అందాలు చూపిస్తూ వయ్యారాలు ఒలకబోసింది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్‌లో దర్శనమిచ్చే ప్రగ్యా చీరలో కనిపించడంతో ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కొంతమంది షాక్ అవుతుండగా.. మరికొందరు గార్జియస్, వాల్, క్యూట్ అని కామెంట్లు పెడుతున్నారు. 

Full View

Tags:    

Similar News