‘పుష్ప-2’పై నటి సంయుక్త ట్వీట్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన సినిమా ‘పుష్ప-2’.

Update: 2024-12-17 08:17 GMT

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన సినిమా ‘పుష్ప-2’. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ పుష్పకు సీక్వెల్‌గా వచ్చింది. అయితే ‘పుష్ప-2’(Pushpa 2: The Rule) మూవీ భారీ అంచనా మధ్య డిసెంబర్ 5న విడుదలై సూపర్ హిట్ సాధించింది. అలాగే భారీ కలెక్షన్లు రాబడుతూ పలు రికార్డులతో బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తుంది.

అంతేకాకుండా పలు విమర్శలు కూడా ఎదుర్కొంటుంది. దానికి కారణం ‘పుష్ప-2’ విడుదలకు ముందు ప్రీమియర్ షోలు వేయగా తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, తమిళ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంయుక్త షన్‌ముఘనాథన్(Samyuktha Shanmuganathan) ‘పుష్ప-2’ మూవీపై ట్వీట్ చేసింది.

‘‘ఫోనిక్స్ మాల్‌లో పుష్ప 2 చూశా.. జాతర సీన్ స్టార్ట్ అవ్వడం, చీరలో హీరో డ్యాన్స్ వేయడంతో.. నా పక్కనే ఉన్న మహిళ పూనకం వచ్చినట్టుగా చేసింది. ఆమె భర్త ఏమో తనని కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు.. దీంతో దెబ్బకు భయం వేసి పది రూపాయల టికెట్‌కు వెళ్లి కూర్చున్నా’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రూ. 10 టికెట్ ఎప్పుడో రద్దు అయింది నువ్వు ఏ కాలంలో ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు ఎక్కడా ఆ ధరకు సినిమా టికెట్ అమ్మడం లేదని ట్రోల్ చేస్తున్నారు.

Tags:    

Similar News