Anushka Shetty: ఇన్‌స్టాలో ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలనే ఫాలో అవుతున్న అనుష్క.. ఎవరంటే?

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) అందరికీ సుపరిచితమే. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2024-12-29 15:28 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) అందరికీ సుపరిచితమే. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ గుర్తింపు తెచ్చుకుంది. టాప్ హీరోలతో నటించి మెప్పించింది. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించి దుమ్మురేపింది. కానీ ‘సైజ్ జీరో’ సినిమా తర్వాత అవకాశాలు తగ్గడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా అయింది. మళ్లీ 2023లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’(Miss Shetty Mr. Polishetty) చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం అనుష్క ‘ఘాటి’(Ghaati)తో పాటు ఓ మలయాళ సినిమాలో కూడా నటిస్తుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ రెండు భారీ ప్రాజెక్టులు వచ్చే ఏడాది థియేటర్స్‌లో విడుదల కానున్నాయి.

అయితే స్వీటీ సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. ఇన్‌స్టాలో 7 మిలయన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నప్పటికీ ఎలాంటి పోస్టులు పెట్టదు. ఇదిలా ఉంటే.. తాజాగా, అనుష్క టాలీవుడ్‌లో చాలా మందితో నటించినప్పటికీ ఓ ఇద్దరిని మాత్రమే ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నట్లు సమాచారం. 12 మందిని ఫాలో అవుతుండగా.. అందులో కృతి శెట్టి(Kriti Shetty), రాజమౌళి, కాజల్ అగర్వాల్(Kajal Aggarwal), దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), పీవీ సింధు, హన్సిక,రాశి ఖన్నాతో పాటు టాలీవుడ్ హీరోలు ప్రభాస్(Prabhas), రానా మాత్రమే ఉండటం విశేషం. ప్రస్తుతం ఇదే విషయం నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో అది తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read More...

Deepika Padukone: ‘కల్కి-2’ ఫస్ట్ ప్రయారిటీ కాదు.. దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్స్!

Tags:    

Similar News