Allu Arjun: అల్లు అర్జున్ న్యూ లుక్.. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు
కోర్టుకు హాజరైన అల్లు అర్జున్ రెండు పూచీకత్తుల పత్రాలను సమర్పించి, న్యాయమూర్తి ముందు హాజరయ్యారు.
దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా తెరకెక్కిన " పుష్ప 2 " (Pushpa 2 )మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. రిలీజ్ రోజున సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందటం చాలా బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయం పై సీరియస్ అయ్యి కొందర్ని అందులోకి తీసుకుంది. వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారు.
అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే , కోర్టుకు హాజరైన అల్లు అర్జున్ రెండు పూచీకత్తుల పత్రాలను సమర్పించి, న్యాయమూర్తి ముందు హాజరయ్యారు.
ఈ క్రమంలోనే, బన్నీ తన కొత్త లుక్ లో కనిపించి అందర్నీ షాక్ కి గురి చేశారు. ఆరేళ్లుగా 'పుష్ప' మూవీ కోసం జుట్టు, గడ్డం పెంచిన అల్లు అర్జున్.. కొత్త హెయిర్‌స్టైల్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ ఘటనలో మొదటి సారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు కూడా పుష్ప సినిమా హెయిర్ స్టైల్లోనే కనిపించాడు. ఇక, ఇప్పుడు నార్మల్ గా కనిపించడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల వారు కూడా వావ్, సూపర్ అంటున్నారు. బన్నీ కొత్త లుక్ సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.