ఆమె నాకు దూరం అయ్యాక ఏడాదిన్నరపాటు ఆ పనికి బానిసయ్యాను.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం నిర్మాతగా మారి పలు సినిమాలు తెరకెక్కించడంతో పాటు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ‘సితారే జమీన్ పర్’(Sitaare Zameen Par)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో.. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా, ఆమిర్ ఖాన్ తన మాజీ భార్య రీనాదత్తా(Reena Dutta)తో విడాకులు జరిగిన సమయంలో చాలా బాధపడినట్లు తెలిపారు.
‘‘రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత నేను చాలా బాధపడ్డాను. దాదాపు మూడేళ్లపాటు అలాగే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో వర్క్‌పై దృష్టి పెట్టలేకపోయాను. దీంతో సినిమాలకు దూరం అయ్యాను. ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడేవాడిని. నిద్ర పట్టేది కాదు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో ప్రశాంతంగా నిద్రపోవడం కోసం మద్యం అలవాటు చేసుకున్నా. ఏడాదిన్నపాటు రోజుకో బాటిల్ తాగేవాడిని. మొత్తం దేవదాస్‌లా అయిపోయాను. తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యా. ఆ బాధ నుంచి బయడపడటానికి ఎక్కువ సమయం పట్టింది. ఆ తర్వాతే ఇష్టపడిన వారు పక్కన లేకుండానే జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. పరిస్థితిని అర్థం చేసుకున్నా’’ అని చెప్పుకొచ్చారు.