విపత్కర పరిస్థితుల్లో సినీ సహాయం ఇలా…
దిశ, వెబ్ డెస్క్: దేశంలో గడ్డు పరిస్థితులే ఏర్పడ్డాయి. కరోనా మహమ్మారి విలయ తాండవానికి చాలా మంది ప్రభావితం అయ్యారు. చాలా నష్టపోయారు. కానీ ప్రాణం కన్నా పైసా ఎక్కువ కాదు కదా. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టొద్దని చెప్పింది. మేమే మీకు ఆర్దికంగా అండగా ఉంటామని చెప్తుంది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూక్ష్మ విరాళాలు సైతం ఆహ్వానించాడు. బాలీవుడ్ అలా… ఇలాంటి పరిస్తితుల్లో బాలీవుడ్ హీరోలు కార్తీక్ ఆర్యన్, వరుణ్ […]
దిశ, వెబ్ డెస్క్:
దేశంలో గడ్డు పరిస్థితులే ఏర్పడ్డాయి. కరోనా మహమ్మారి విలయ తాండవానికి చాలా మంది ప్రభావితం అయ్యారు. చాలా నష్టపోయారు. కానీ ప్రాణం కన్నా పైసా ఎక్కువ కాదు కదా. అందుకే ఎన్ని కష్టాలొచ్చినా ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టొద్దని చెప్పింది. మేమే మీకు ఆర్దికంగా అండగా ఉంటామని చెప్తుంది. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూక్ష్మ విరాళాలు సైతం ఆహ్వానించాడు.
బాలీవుడ్ అలా…
ఇలాంటి పరిస్తితుల్లో బాలీవుడ్ హీరోలు కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్ లు వెనుకడుగు వేయలేదు. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన హీరోలు తమ వంతు సహాయం అందించారు. పీఎం కేర్స్ ఫండ్ కు కార్తిక్ ఆర్యన్ రూ. కోటి రూపాయలు, వరుణ్ ధావన్ రూ. 50 లక్షల విరాళం అందించారు. అటు సీనియర్ హీరోలు అక్షయ్ కుమార్ రూ. 25 కోట్లు విరాళం ఇవ్వగా… సల్మాన్ ఖాన్ 25 వేల మంది సినీ కార్మికులకు అండగా నిలిచారు.
టాలీవుడ్ ఇలా…
కరోనా మహమ్మారి ప్రభావంతో కొన్ని సినీ కళాకారుల కుటుంబాలు పస్తులుండే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు పరిష్కారం చూపెయ్ దిశగా కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసిన తెలుగు ఇండస్ట్రీ పెద్దలు చిరు, నాగార్జున, వెంకటేష్, సురేష్ బాబు లాంటి వారు … కోట్లలో విరాళాలు ఇచ్చారు. ఇతరులను విరాళాలు అందించేలా స్ఫూర్తిని పంచుతూ … సేకరించిన డబ్బులతో పేద కళాకారులకు భోజనం పెడుతున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్, నాగ చైతన్య, అల్లు అర్జున్, ధరమ్ తేజ్, సందీప్ కిషన్, సుశాంత్ లాంటి హీరోలు ఇప్పటికే లక్షల్లో విరాళం ప్రకటించగా… తాజాగా నారా రోహిత్ రూ. 30 లక్షలు అందించారు. కమెడియన్ వెన్నెల కిషోర్, సప్తగిరి చెరో రూ. 2 లక్షల సాయాన్ని ప్రకటించగా… మరింత మంది నిర్మాతలు, దర్శకులు తమ వంతు సహాయం ప్రకటిస్తున్నారు.
తాజాగా తన పుట్టిన రోజు( మార్చి 31 )సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ తన సహాయాన్ని ప్రకటించారు. రెండు నెలల పాటు 45 మంది అనాధ పిల్లలకు భోజనం తో పాటు స్వీట్స్, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్, కేక్స్ అందించనున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో బాధ్యత గల పౌరులు ఎలా ఉండాలో చేసి చూపిస్తున్నాడు. కరోనా వైరస్ తో బాధపడుతున్న రోగులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు వైద్య పరికరాలు, మాస్క్ లు అందించిన నిఖిల్… రెండో దశలో కరోనా కట్టడికి రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తున్న పోలీసు అధికారులకు శానిటైజర్లు అందించాడు. మనల్ని కాపాడేందుకు ముందు నిలబడుతున్న పోలీసులకు థాంక్స్ చెప్పాడు.
అంతటితో ఆగకుండా కరోనా కారణంగా తిండి లేక బాధ పడుతున్న వారికి, నిరాశ్రయులకు అండగా నిలిచే దిశగా అడుగులు వేశారు. యూసఫ్ గూడ ఏరియాలోని స్రవంతి నగర్ లో ఉండే జనతా కిచెన్ లో ఫుడ్ అందించే ఏర్పాట్లు చేశారు నిఖిల్.
Tags: Bollywood, Tollywood, PM CARES Fund, CCC