అనకాపల్లి 177/3డీలో ఏం జరిగింది..? రంగంలోకి సీఐడీ అధికారులు

దిశ, ఉత్తరాంధ్ర : విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని భూ అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టింది. బవులువాడలో 2.57 ఎకరాల ప్రభుత్వ భూమికి పాసుపుస్తకాలు మంజూరు చేయడం, ఆపై భూ స్వభావం మార్చారంటూ వచ్చిన ఫిర్యాదులపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సర్వే నంబరు 177/3డీలో ప్రభుత్వ భూమికి ఈ ఏడాది మేలో అక్రమంగా పాసు పుస్తకాలు మంజూరు చేశారు రెవెన్యూ అధికారులు. అయితే దీనిపై వినియోగదారుల హక్కుల సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ సీఎం […]

Update: 2021-10-17 05:37 GMT

దిశ, ఉత్తరాంధ్ర : విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని భూ అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టింది. బవులువాడలో 2.57 ఎకరాల ప్రభుత్వ భూమికి పాసుపుస్తకాలు మంజూరు చేయడం, ఆపై భూ స్వభావం మార్చారంటూ వచ్చిన ఫిర్యాదులపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సర్వే నంబరు 177/3డీలో ప్రభుత్వ భూమికి ఈ ఏడాది మేలో అక్రమంగా పాసు పుస్తకాలు మంజూరు చేశారు రెవెన్యూ అధికారులు. అయితే దీనిపై వినియోగదారుల హక్కుల సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ సీఎం కార్యాలయానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విచారణ బాధ్యతను సీఐడీ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సీఐడీ డీజీ ఆదేశాల మేరకు సీఐ పార్థసారధి నేతృత్వంలో ఈ దర్యాప్తు చేపడుతున్న అధికారులు తెలియజేశారు.

Tags:    

Similar News