బచ్చా .. నీ బట్టర్ ఉడకదు రా: చిరు

మెగాస్టార్ చిరంజీవికి తల్లి అంటే ప్రాణం. అమ్మ ఆశీర్వాదం లేనిదే ఏ పని మొదలుపెట్టడు. తల్లికి అన్ని సమకూర్చడం, ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఈ మధ్య #betheREALMAN చాలెంజ్ లో కూడా తల్లి అంజనాదేవికి పెసరట్టు చేసి పెట్టాడు. అమ్మను దగ్గరుండి చూసుకోవడం అంటే అంత ఇష్టం చిరుకు. మై డియర్ బచ్చా …మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. How […]

Update: 2020-05-02 01:58 GMT

మెగాస్టార్ చిరంజీవికి తల్లి అంటే ప్రాణం. అమ్మ ఆశీర్వాదం లేనిదే ఏ పని మొదలుపెట్టడు. తల్లికి అన్ని సమకూర్చడం, ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఈ మధ్య #betheREALMAN చాలెంజ్ లో కూడా తల్లి అంజనాదేవికి పెసరట్టు చేసి పెట్టాడు. అమ్మను దగ్గరుండి చూసుకోవడం అంటే అంత ఇష్టం చిరుకు.

అయితే గురువారం నానమ్మ దగ్గర స్వచ్ఛమైన వెన్నె ఎలా తీయాలో నేర్చుకుంటున్నాను అని పోస్ట్ పెట్టాడు చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్. ఈ వీడియో పై చాలా ఫన్నీగా స్పందించారు చిరు.

మై డియర్ బచ్చా …మా అమ్మ దగ్గర నీ ‘బట్టర్ ‘ ఉడకదురా. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు నాదే. నువు ఎంత బాగా బట్టర్ చేసినా…మా అమ్మ దగ్గర నీ పొజిషన్ బెటర్ కాదు.. కాలేదు అంటూ ట్వీట్ చేశాడు చిరు. కానీ.. అదే గ్యారెంటీ నాకు మీ అమ్మ దగ్గర లేదనుకో అంటూ పోస్ట్ పెట్టిన చిరు…తల్లికి కొడుకు హృదయంలో ఎప్పుడూ ప్రత్యేకస్థానం ఉంటుందని చెప్పకనే చేశాడు.

Tags : Chiranjeevi, Ram Charan Tej, Tollywood, Konidela

Tags:    

Similar News