సినీ కార్మికులకు చిరు చేయూత
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ పెద్దదిక్కుగా ఉన్నాడు. ఏ సినీ కార్యక్రమం జరిగినా ముందుండి నడిపిస్తున్నాడు. మాలో గొడవలను చక్కబెట్టేందుకు కూడా ప్రయత్నించిన ఆయన.. ప్రస్తుతం సినీ జనానికి ఆపద్బాంధవుడిగా మారి ఆర్థిసాయం అందించేందుకు ముందుకొచ్చాడు. కరోనా మహమ్మారి ప్రభావితం చూపుతున్న సమయంలో లాక్ డౌన్ అనేది తప్పనిసరి అయిపోయింది. దీంతో దేశంలోని దినసరి కూలీలు, తక్కువ ఆదాయ వర్గాల జీవితాలపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఇలాంటి కష్టాలనే […]
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ పెద్దదిక్కుగా ఉన్నాడు. ఏ సినీ కార్యక్రమం జరిగినా ముందుండి నడిపిస్తున్నాడు. మాలో గొడవలను చక్కబెట్టేందుకు కూడా ప్రయత్నించిన ఆయన.. ప్రస్తుతం సినీ జనానికి ఆపద్బాంధవుడిగా మారి ఆర్థిసాయం అందించేందుకు ముందుకొచ్చాడు. కరోనా మహమ్మారి ప్రభావితం చూపుతున్న సమయంలో లాక్ డౌన్ అనేది తప్పనిసరి అయిపోయింది. దీంతో దేశంలోని దినసరి కూలీలు, తక్కువ ఆదాయ వర్గాల జీవితాలపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఇలాంటి కష్టాలనే అనుభవిస్తున్నారు సినీ కార్మికులు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మెగాస్టార్ చిరు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. సినీ కార్మికులకు సహాయంగా రూ. కోటి రూపాయల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే మెగా ఫ్యామిలీ నుంచి తమ్ముడు పవన్ రూ. 2 కోట్ల విరాళం అందించగా… కొడుకు రామ్ చరణ్ తేజ్ రూ. 70 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఇప్పుడు మెగా స్టార్ సినీ కార్మికులకు రూ. కోటి రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చి… మెగా ఫ్యామిలీ అంటే ఏంటో నిరూపించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల కోసం ముగ్గురు మొనగాళ్లు మేమున్నామని భరోసా ఇవ్వడం హర్షణీయమని అభినందిస్తున్నారు.
Tags : Megastar Chiranjeevi, Covid 19, CoronaVirus, TFI