ఇన్‌స్టాలో సీక్రెట్.. మరాఠీల వైభవాన్ని గుర్తుచేసిన ‘చింగారి’
దిశ, సినిమా: సల్మాన్ ఖాన్ ‘అంతిమ్’ నుంచి తాజాగా రిలీజైన ‘చింగారి’ సాంగ్.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మరాఠీ జానపద నృత్యంతో కూడిన ఈ పాట.. సామాజిక మాధ్యమాలను ఉద్ధేశిస్తూ సాగుతుండగా..‘ఆజ్ కుల్ జా నే దే స్టోరీ తేరీ మేరీ.. దాలో ఇన్ స్టా పే మే స్టోరీ తేరీ మేరీ’ అంటూ సాగే ఈ గీతంలో లావణి చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సాంగ్ ప్రత్యేకతను గురించి తెలిపిన దర్శకుడు […]
దిశ, సినిమా: సల్మాన్ ఖాన్ ‘అంతిమ్’ నుంచి తాజాగా రిలీజైన ‘చింగారి’ సాంగ్.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. మరాఠీ జానపద నృత్యంతో కూడిన ఈ పాట.. సామాజిక మాధ్యమాలను ఉద్ధేశిస్తూ సాగుతుండగా..‘ఆజ్ కుల్ జా నే దే స్టోరీ తేరీ మేరీ.. దాలో ఇన్ స్టా పే మే స్టోరీ తేరీ మేరీ’ అంటూ సాగే ఈ గీతంలో లావణి చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇక ఈ సాంగ్ ప్రత్యేకతను గురించి తెలిపిన దర్శకుడు మహేష్ మంజ్రేకర్.. మరాఠీల గత వైభవాన్ని తీసుకురావడంలో భాగంగానే పాటను ఈ విధంగా తెరకెక్కించినట్లు వివరించాడు. ఇక వైభవ్ జోషి రచించిన ఈ గీతాన్ని సునిధి చౌహాన్ ఆలపించగా.. హతేష్ మోదక్ సంగీతం, కృతి మహేష్ కొరియోగ్రఫీ అందించారు. నవంబర్ 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సినిమాలో ఆయుష్ శర్మ, మహిమ మక్వానా ప్రధానపాత్రల్లో నటించగా… సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు.
#Chingari Song Out Now!https://t.co/EiLJrktBAX#AayushSharma @MahimaMakwana_ @Iamwaluscha @manjrekarmahesh @SKFilmsOfficial @ZeeStudios_ #HiteshModak @vaibhavjoshee @SunidhiChauhan5 @KrutiMahesh @ZeeMusicCompany @ZeeCinema @Zee5India @Chingari_IN
— Salman Khan (@BeingSalmanKhan) November 12, 2021