‘ఆక్రమించాలని చూస్తే అంతుచూస్తాం’

న్యూఢిల్లీ: ఎవరైనా గద్ద కళ్లతో ఆక్రమించాలని చూస్తే వారి అంతుచూస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. చైనాతో ఉద్రిక్తతలను పేర్కొంటూ మనవైపు 20 మంది జవాన్లు వీర మరణం పొందారని, వారి వైపు రెట్టింపు మరణాలు చోటుచేసుకున్నాయని అన్నారు. గాల్వన్ లోయలో సరిహద్దులో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో చైనా క్షతగాత్రుల వివరాలను ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే, ఆ ఘర్షణల్లో కమాండింగ్ అధికారి చనిపోయాడని మాత్రం అంగీకరించింది. బెంగాల్ వర్చువల్ ర్యాలీని ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి ప్రసంగించారు. […]

Update: 2020-07-02 04:56 GMT

న్యూఢిల్లీ: ఎవరైనా గద్ద కళ్లతో ఆక్రమించాలని చూస్తే వారి అంతుచూస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. చైనాతో ఉద్రిక్తతలను పేర్కొంటూ మనవైపు 20 మంది జవాన్లు వీర మరణం పొందారని, వారి వైపు రెట్టింపు మరణాలు చోటుచేసుకున్నాయని అన్నారు. గాల్వన్ లోయలో సరిహద్దులో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణల్లో చైనా క్షతగాత్రుల వివరాలను ఇప్పటివరకు ప్రకటించలేదు. అయితే, ఆ ఘర్షణల్లో కమాండింగ్ అధికారి చనిపోయాడని మాత్రం అంగీకరించింది. బెంగాల్ వర్చువల్ ర్యాలీని ఉద్దేశిస్తూ కేంద్ర మంత్రి ప్రసంగించారు. ‘ఇప్పుడు మీరు రెండు ‘సీ’ల గురించి మాత్రమే వింటారు. ఒకటి కరోనావైరస్, రెండు చైనా. మేం శాంతిని నమ్ముతాం. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని విశ్వసిస్తాం. కానీ, ఎవరైనా భారత్‌పై కన్నెత్తి చూస్తే దీటుగా బదులిస్తాం. మన జవాన్లు 20 మంది కన్నుమూస్తే చైనావైపున ఈ సంఖ్య రెట్టింపు’ అని వివరించారు. మన జవాన్లు త్యాగాలు వృథా పోవని ప్రధాని మోడీ ఊరికే అనలేదని, అందులో నిగూఢ అర్థం ఉన్నదని తెలిపారు.

Tags:    

Similar News