భారత్‌కు కృతజ్ఞతలు : చైనా
భారత స్నేహ హస్తానికి చైనా కృతజ్ఞతలు తెలిపింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు భారత ప్రధాని మోడీ రాసిన లేఖపై ఆ దేశ విదేశాంగ శాఖ స్పందించింది. కరోనా వైరస్‌తో వణికిపోతున్న చైనా ప్రజలు, ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్‌కు భారత్ అండగా ఉంటుందని, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సాయపడుతుందని మోడీ లేఖ రాశాడు. ఈ లేఖ పై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. ఇది […]
భారత స్నేహ హస్తానికి చైనా కృతజ్ఞతలు తెలిపింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు భారత ప్రధాని మోడీ రాసిన లేఖపై ఆ దేశ విదేశాంగ శాఖ స్పందించింది. కరోనా వైరస్‌తో వణికిపోతున్న చైనా ప్రజలు, ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్‌కు భారత్ అండగా ఉంటుందని, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సాయపడుతుందని మోడీ లేఖ రాశాడు. ఈ లేఖ పై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. ఇది భారత్, చైనాల మధ్య స్నేహ బంధాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. కరోనా వైరస్ పై పోరాటానికి కలిసి వచ్చేందుకు సిద్ధమైన భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చైనాతో భారత్ మైత్రిని ఆ లేఖ పూర్తిగా ప్రతిఫలింపజేసిందని వివరించారు.