యాప్స్‌పై బ్యాన్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నాం: చైనా
న్యూఢిల్లీ: చైనీస్ యాప్‌లను భారత్ బ్యాన్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చైనా స్పందించింది. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. చైనీస్ వ్యాపారాల హక్కులను పరిరక్షించే బాధ్యత భారత్‌కు ఉన్నదని, కానీ, వాటిపై నిషేధాన్ని ప్రకటించడాన్ని పరిశీలిస్తున్నామని, ఆ ప్రకటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చైనీస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జావో లిజియన్ మీడియా సమావేశంలో అన్నారు. బైటెండెన్స్‌కు చెందిన టిక్‌టాక్, టెన్సెంట్స్‌కు చెందిన వీడియో షేరింగ్ యాప్ వీచాట్, అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్, షావోమీకి చెందిన రెండు […]
న్యూఢిల్లీ: చైనీస్ యాప్‌లను భారత్ బ్యాన్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చైనా స్పందించింది. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. చైనీస్ వ్యాపారాల హక్కులను పరిరక్షించే బాధ్యత భారత్‌కు ఉన్నదని, కానీ, వాటిపై నిషేధాన్ని ప్రకటించడాన్ని పరిశీలిస్తున్నామని, ఆ ప్రకటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చైనీస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జావో లిజియన్ మీడియా సమావేశంలో అన్నారు. బైటెండెన్స్‌కు చెందిన టిక్‌టాక్, టెన్సెంట్స్‌కు చెందిన వీడియో షేరింగ్ యాప్ వీచాట్, అలీబాబాకు చెందిన యూసీ బ్రౌజర్, షావోమీకి చెందిన రెండు అప్లికేషన్లను భారత్ సోమవారం సాయంత్రం నిషేధించింది. భారత సార్వభౌమ, సమగ్రత, రక్షణ, శాంతికి భంగం కలగకూడదన్న లక్ష్యంతో కొన్ని ఆరోపణల దృష్ట్యా వీటిని నిషేధిస్తున్నట్టు భారత సమాచర సాంకేతిక శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయంపై కంపెనీలు ప్యానెల్ ముందు అభిప్రాయాలు తెలుపుకోవాలని, వాటిని పరిగణనలోకి తీసుకున్నట్టు సదరు అప్లికేషన్‌పై నిషేధాన్ని కొనసాగించాలా? లేదా? అనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కాగా, భారత చట్టాలన్నీ ఎప్పటిలాగే పాటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు గతంలో, భవిష్యత్తులోనూ యూజర్ల సమాచారాన్ని చైనా సహా ఏ విదేశాలతోనూ పంచుకోలేదు, పంచుకోబోమని ఈ రోజు ఉదయం టిక్‌టాక్ ఒక స్టేట్‌మెంట్ విడుదల చేసింది.