చైనానే రెచ్చగొట్టి ఉండొచ్చు: యూఎస్ సెనేటర్

వాషింగ్టన్: భారత్‌కు చెందిన కొన్ని భూభాగాలను ఆక్రమించుకోవాలనే ఉద్దేశ్యంతో చైనానే హింసాత్మక ఘర్షణలను ప్రేరేపించి ఉండవచ్చునని అమెరికా సెనేటర్ మిచ్ మెక్‌కానల్ అన్నారు. భారత సైన్యాన్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రెచ్చగొట్టి ఉండొచ్చునని చెప్పారు. కాంగ్రెస్ హౌజ్‌లో అమెరికా విదేశాంగ విధానాలపై ఆయన ప్రసంగిస్తూ, ఈ రెండు అణ్వాయుధ దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలను ఆసాంతం యావత్ ప్రపంచం ఆందోళనగా చూసిందని వివరించారు. ఇరుదేశాలు సంయమనం పాటించి శాంతి నెలకొల్పాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. చైనా తన […]

Update: 2020-06-19 03:04 GMT

వాషింగ్టన్: భారత్‌కు చెందిన కొన్ని భూభాగాలను ఆక్రమించుకోవాలనే ఉద్దేశ్యంతో చైనానే హింసాత్మక ఘర్షణలను ప్రేరేపించి ఉండవచ్చునని అమెరికా సెనేటర్ మిచ్ మెక్‌కానల్ అన్నారు. భారత సైన్యాన్ని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రెచ్చగొట్టి ఉండొచ్చునని చెప్పారు. కాంగ్రెస్ హౌజ్‌లో అమెరికా విదేశాంగ విధానాలపై ఆయన ప్రసంగిస్తూ, ఈ రెండు అణ్వాయుధ దేశాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలను ఆసాంతం యావత్ ప్రపంచం ఆందోళనగా చూసిందని వివరించారు. ఇరుదేశాలు సంయమనం పాటించి శాంతి నెలకొల్పాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. చైనా తన సరిహద్దుల్లోనే దారుణాలకు పాల్పడుతున్నదని, తనకు నచ్చినట్టుగా సరిహద్దులను మార్చాలని చూస్తున్నదని ఆరోపించారు. ప్రపంచపటాన్ని తిరగరాయాలని ప్రయత్నిస్తున్నదని అభిప్రాయపడ్డారు. హాంకాంగ్‌ను అణచివేసేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ కరోనా మహమ్మారిని ఉపయోగించుకున్నదని చెప్పారు. అమెరికా ప్రయోజనాలకు చైనా, దాని మిత్రదేశాలే ఆటంకంగా ఉన్నాయని తన ప్రసంగంలో మెక్‌కానల్ వివరించారు. జపాన్ సమీపంలోని సెంకాకు దీవుల దగ్గరకు చేరి సముద్రజలాల్లోనా చైనా ఆధిపత్యాన్ని చూపిస్తున్నదని, తైవాన్ గగనతలంలోకి రోజలు వ్యవధిలోనే నాలుగుసార్లు చైనా విమానాలు చొచ్చుకెళ్లాయని తెలిపారు.

Tags:    

Similar News