చైనాలో వ్యాక్సిన్ ప్రదర్శన
దిశ, వెబ్‌డెస్క్: చైనా మొదటిసారిగా తన స్వదేశీ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ప్రదర్శనకు ఉంచింది. చైనాకు చెందిన సినొవిక్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌ను బీజింగ్‌లో జరిగిన ట్రేడ్ ఫెయిర్‌లో బహిరంగపరిచింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను నిర్వహిస్తోంది. అనంతరం ఈ వ్యాక్సిన్‌కు మార్కెట్ లభించే అవకాశాలున్నాయని వ్యాక్సిన్ తయారీదారులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి మూడో దశ ప్రయోగాలు పూర్తవుతాయని, ఏడాదికి 30 కోట్ల మోతాదులను ఉత్పత్తి చేయాలని, దీనికోసం ఇప్పటికే ప్రత్యేక […]
దిశ, వెబ్‌డెస్క్: చైనా మొదటిసారిగా తన స్వదేశీ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ప్రదర్శనకు ఉంచింది. చైనాకు చెందిన సినొవిక్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌ను బీజింగ్‌లో జరిగిన ట్రేడ్ ఫెయిర్‌లో బహిరంగపరిచింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను నిర్వహిస్తోంది. అనంతరం ఈ వ్యాక్సిన్‌కు మార్కెట్ లభించే అవకాశాలున్నాయని వ్యాక్సిన్ తయారీదారులు భావిస్తున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి మూడో దశ ప్రయోగాలు పూర్తవుతాయని, ఏడాదికి 30 కోట్ల మోతాదులను ఉత్పత్తి చేయాలని, దీనికోసం ఇప్పటికే ప్రత్యేక కర్మాగారాన్ని నిర్మించినట్టు వ్యాక్సిన్ తయారీ సంస్థ వర్గాలు తెలిపాయి. మూడో దశ ప్రయోగాల్లో ఉన్న ఈ వ్యాక్సిన్ వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు కనీసం ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉండొచ్చనే అంచనాలున్నాయి. ఇక, చివరి దశ ప్రయోగాలు పూర్తయిన తర్వాతే ఫలితాలను తెలియజేయనున్నట్టు వ్యాక్సిన్ తయారీ సంస్థ వెల్లడించింది.