పసికందుకూ కోరనా వైరస్
ప్రస్తుతం కరోనా కొత్తరకం వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకూ కొత్త దేశాలకు వ్యాపిస్తుండటం, మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇది తల్లి ద్వారా గర్భంలోని శిశువుకూ సోకుతుందని వెల్లడైంది. కరోనా కొత్త రకం వైరస్‌కు మూల కేంద్రమైన చైనాలోని వుహాన్ నగరంలో అప్పుడే పుట్టిన పసికందుకు వైద్యపరీక్షలు నిర్వహించగా ఈ నిజం బయటపడింది. బిడ్డకు జన్మను ఇవ్వకు ముందు ఆ […]
ప్రస్తుతం కరోనా కొత్తరకం వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకూ కొత్త దేశాలకు వ్యాపిస్తుండటం, మృతుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి తరుణంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇది తల్లి ద్వారా గర్భంలోని శిశువుకూ సోకుతుందని వెల్లడైంది. కరోనా కొత్త రకం వైరస్‌కు మూల కేంద్రమైన చైనాలోని వుహాన్ నగరంలో అప్పుడే పుట్టిన పసికందుకు వైద్యపరీక్షలు నిర్వహించగా ఈ నిజం బయటపడింది. బిడ్డకు జన్మను ఇవ్వకు ముందు ఆ తల్లికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెకు కరోనా కొత్త రకం వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రసవమైన తర్వాత బిడ్డకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది.