యూఎస్ అతి చేస్తోందంటున్న చైనా
కరోనా వైరస్ విషయంలో అమెరికా అతి చేస్తోందని చైనా ఆరోపణలు చేస్తోంది. ఆపదలో సహాయం చేయకపోగా చైనాలో ఉన్న అమెరికన్లను స్వదేశం తీసుకెళ్లి, విమానాలను రద్దు చేసి ప్రజల్లో భయాన్ని రెట్టింపు చేస్తోందని ఆరోపించింది. చైనాలో ఉన్న వారిని మొదట ఖాళీ చేయించిన దేశం అమెరికా. ఆ తర్వాతే మిగతా దేశాలన్నీ మొదలుపెట్టాయి. ఒక అభివృద్ధి చెందిన దేశం ఇలా చేయడం వల్ల సహాయం చేయాలనుకున్న […]
కరోనా వైరస్ విషయంలో అమెరికా అతి చేస్తోందని చైనా ఆరోపణలు చేస్తోంది. ఆపదలో సహాయం చేయకపోగా చైనాలో ఉన్న అమెరికన్లను స్వదేశం తీసుకెళ్లి, విమానాలను రద్దు చేసి ప్రజల్లో భయాన్ని రెట్టింపు చేస్తోందని ఆరోపించింది. చైనాలో ఉన్న వారిని మొదట ఖాళీ చేయించిన దేశం అమెరికా. ఆ తర్వాతే మిగతా దేశాలన్నీ మొదలుపెట్టాయి.
ఒక అభివృద్ధి చెందిన దేశం ఇలా చేయడం వల్ల సహాయం చేయాలనుకున్న ఇతర దేశాలు కూడా వెనక్కితగ్గి అమెరికా అనుసరిస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ విమర్శించారు. వైరస్ వ్యాప్తి చెందినపుడు సాటి దేశంగా సాయం చేయకపోగా భయాన్ని రెట్టింపు చేసి ఇతర దేశాలను వణికించడం సబబు కాదని ఆమె హితవు పలికారు.
అలాగే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాము చైనాకు ఎంతో సాయం చేస్తు్న్నామని చెప్పుకొచ్చిన మాటలను కూడా ఆమె ఖండించారు. ఇప్పటివరకు అమెరికా తమకు ఎలాంటి సాయం చేయలేదని స్పష్టం చేశారు.
చైనాలోని వుహాన్ నుంచి ప్రారంభమైన ఈ కరోనా వైరస్ అక్కడ 17వేల మందికి పైగా సోకగా 361 మంది మృత్యువాతపడ్డారు. అలాగే అమెరికా, జపాన్ వంటి దేశాల్లో కూడా అడపాదడపా కేసులు కలిపి 170కి పైగా నమోదయ్యాయి.