దళితబంధు ఇస్తే ఏం జేస్తరు.. వాసాలమర్రి ప్రజలతో కేసీఆర్
దిశ ప్రతినిధి, నల్లగొండ: మీరు బాగుపడాలంటే ఏం కావాలి..?, దళిత బంధు ఇస్తే ఏం చేస్తారంటూ సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామస్తులను పలకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో బుధవారం రెండోసారి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వాసాలమర్రి గ్రామానికి రైతులతో సమావేశం అయ్యేందుకు వచ్చారు. రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ వాసాలమర్రికి చేరుకున్నారు. అనంతరం పలు వీధుల్లో సీఎం కేసీఆర్ పర్యటించగా, కొన్నిచోట్ల ఆగి […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: మీరు బాగుపడాలంటే ఏం కావాలి..?, దళిత బంధు ఇస్తే ఏం చేస్తారంటూ సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామస్తులను పలకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో బుధవారం రెండోసారి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే వాసాలమర్రి గ్రామానికి రైతులతో సమావేశం అయ్యేందుకు వచ్చారు. రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ వాసాలమర్రికి చేరుకున్నారు. అనంతరం పలు వీధుల్లో సీఎం కేసీఆర్ పర్యటించగా, కొన్నిచోట్ల ఆగి ఇళ్లలోని ఇంటి యజమానుల వివరాలను సీఎం కేసీఆర్ సేకరించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా ఇళ్లు కావాలని పలువురు పేదలు కోరారు. దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ త్వరలోనే ఇళ్లు కట్టిస్తామని భరోసానిచ్చారు. అనంతరం దళితవాడలో పర్యటించిన సందర్భంగా దళితబంధు ఇస్తే ఏం చేస్తారంటూ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కొంతమంది వ్యవసాయానికి వాడుకుంటామని చెప్పగా, మరికొంతమంది కుటుంబ అవసరాలకు వాడుకుంటామని చెప్పడం గమనార్హం.