నాన్ వెజ్ ప్రియులకు భారీ షాక్.. కేజీ చికెన్ రూ.300
దిశ, వెబ్‌డెస్క్ : నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలింది. కేవలం మూడు వారాలా వ్యవధిలోనే చికెన్ ధర రూ.100 పెరగడంతో మాంసం ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చికెన్ ధరలు విపరీతంగా మండిపోతుంటంతో నాన్ ప్రియులు నోరెళ్ల బెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.300 పలుకుతోంది. జిల్లాలో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. పక్క జిల్లాల నుంచి కోళ్లు దిగుమతి చేసుకుంటుండటం, […]
దిశ, వెబ్‌డెస్క్ : నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలింది. కేవలం మూడు వారాలా వ్యవధిలోనే చికెన్ ధర రూ.100 పెరగడంతో మాంసం ప్రియులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చికెన్ ధరలు విపరీతంగా మండిపోతుంటంతో నాన్ ప్రియులు నోరెళ్ల బెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.300 పలుకుతోంది.
జిల్లాలో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. పక్క జిల్లాల నుంచి కోళ్లు దిగుమతి చేసుకుంటుండటం, రవాణా చార్జీల భారం, కోళ్లకు వేసే దాణా ధరలు విపరీతంగా పెరగడం కూడా మార్కెట్లో చికెన్ ధరలు పెరగడానికి మరో కారణమని దుకాణాదారులు వెల్లడించారు.