ఆ ప్రమిదలో 24 గంటలు కాంతి..తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: దీపావళి మరికొన్ని రోజుల్లో రాబోతుంది. లోగిళ్లలో, ఇంటి ఆవరణలో అందరూ దీపాలు వెలిగిస్తుంటారు. అందుకోసం దీప ప్రమిదలు ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చాయి. ఏండ్లుగా మార్కెట్‌లో చైనా ఉత్పత్తులు మన లోకల్ ఉత్పత్తులకు అడ్డుగా నిలిచేవి. కానీ, గతేడాది నుంచి పరిస్థితి మారింది. లోకల్ ప్రమీదలు కొనేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. గతేడాది ‘పాటర్ కి దివాళి’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. అందులో భాగంగానే కుమ్మరి వాళ్లు తయారుచేసిన ప్రమిదలు, ల్యాంతర్లను కొనుగోలు చేశారు. ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: దీపావళి మరికొన్ని రోజుల్లో రాబోతుంది. లోగిళ్లలో, ఇంటి ఆవరణలో అందరూ దీపాలు వెలిగిస్తుంటారు. అందుకోసం దీప ప్రమిదలు ఇప్పటికే మార్కెట్‌లోకి వచ్చాయి. ఏండ్లుగా మార్కెట్‌లో చైనా ఉత్పత్తులు మన లోకల్ ఉత్పత్తులకు అడ్డుగా నిలిచేవి. కానీ, గతేడాది నుంచి పరిస్థితి మారింది. లోకల్ ప్రమీదలు కొనేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. గతేడాది ‘పాటర్ కి దివాళి’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. అందులో భాగంగానే కుమ్మరి వాళ్లు తయారుచేసిన ప్రమిదలు, ల్యాంతర్లను కొనుగోలు చేశారు. ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ నడుస్తోంది. ఈ క్రమంలో లో కుమ్మరి చేసిన 24 గంటల ప్రమిద అందర్నీ ఆకట్టుకుంటోంది.
దీపావళికి మూడు రోజుల ముందు నుంచి కార్తీక మాసం చివరి వరకు మహిళలు ఇంటి ముందర దీపాలు వెలిగిస్తారు. ఇది సంప్రదాయంగా వస్తోంది. దీప కాంతితో ఇల్లు ఎంతో శోభాయామానంగా ఉంటుంది. కానీ, అందులో పదే పదే నూనె పోయడం కాస్త ఇబ్బందే. దీపంలో నూనె ఉందా? లేదా? అని చూడాలి. ఆ టెన్షన్ లేకుండా ఒక్కసారి నూనె పోస్తే రెండో రోజు వరకు మళ్లీ నూనె పోసే అవకాశం రాకుండా ఓ కుమ్మరి 24 గంటలు వెలిగే ప్రమిదను తయారు చేశాడు. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కొండెగావ్‌కు చెందిన అశోక్ చక్రధరి ప్రతి దీపావళికి వివిధ ఆకృతుల ప్రమిదలు, మట్టి బొమ్మలు చేస్తుంటాడు. ఈసారి మాత్రం కాస్త సృజనాత్మకంగా ఆలోచించి ‘మ్యాజిక్ ల్యాంప్’ను రూపొందించాడు. ఈ సంప్రదాయ ప్రమిద 24 గంటల నుంచి 40 గంటల పాటు దీపం ఆరిపోకుండా కాంతులు వెదజల్లుతూనే ఉంటుంది. అదెలా అంటారా? ఈ దీపంలో పోసిన నూనె ఆటోమేటిక్‌గా సర్క్యూలేట్ కావడమే అందుకు కారణం.
ఆర్డర్స్ వస్తున్నాయి: అశోక చక్రధరి, ఛత్తీస్‌గఢ్
నేనెప్పుడు కొత్త ఆలోచనలతో నా పని చేయాలనుకుంటాను. అలా చేయడం వల్ల చాలెంజింగ్‌గా ఉంటుంది. నేను ఈ దీపాన్ని తయారుచేయడానికి ఎన్నో ఆన్‌లైన్ టెక్నిక్స్ చూశాను. 5, 6 డిజైన్లలో దీన్ని తయారు చేసి చూశాను. చివరగా ఫైనల్ ఔట్‌పుట్‌తో సక్సెస్ సాధించాను. దీన్ని చూసిన చాలామంది అలాంటి దీపాలు కావాలని ఎక్కువ ఆర్డర్స్ ఇస్తున్నారు.