మావోయిస్టు బంద్ నేపథ్యంలో ముమ్మర తనిఖీలు…..!

దిశ, చెన్నూర్ : రేపు మావోయిస్టు బంద్ ని దృష్టిలో పెట్టుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలం లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతలైన పరిసర ప్రాంతాలను, అంతరాష్ట్ర సరిహద్దు సిర్వంచ బ్రిడ్జ్ ఆదివారం సాయంత్రం రామగుండం కమిషనర్ సత్య నారాయణ సందర్శించారు. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, రాత్రింబవళ్లు తేడా లేకుండా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని ఏసీపీ లు , సిఐలు, ఎస్సైల నుండి ఎప్పటికప్పుడు […]

Update: 2021-04-25 09:15 GMT

దిశ, చెన్నూర్ : రేపు మావోయిస్టు బంద్ ని దృష్టిలో పెట్టుకొని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లాలో కోటపల్లి మండలం లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతలైన పరిసర ప్రాంతాలను, అంతరాష్ట్ర సరిహద్దు సిర్వంచ బ్రిడ్జ్ ఆదివారం సాయంత్రం రామగుండం కమిషనర్ సత్య నారాయణ సందర్శించారు. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, రాత్రింబవళ్లు తేడా లేకుండా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని ఏసీపీ లు , సిఐలు, ఎస్సైల నుండి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ, అధికారులను అప్రమత్తం చేస్తూ, తగు సూచనలు చేస్తున్నామన్నారు.

మావోల అసాంఘిక కార్యకలపాలకు తావివ్వకుండా ముందస్తూగా పోలీస్ బలగాలు పహరా కాస్తున్నాయి అని ఆయన తెలిపారు. ముఖ్యంగా ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని గ్రామాలు, మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన మహరాష్ట్ర లోని (అహెరి, అల్లంపేట), పలు గ్రామలలోని ఫెర్రీ పాయింట్స్ ని సందర్శించి, పడవలు నడిపేవారితో, చేపలు పట్టేవారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకొని మావోయిస్టుల కదలికపై పెద్ద ఎత్తున నిఘా పెట్టమన్నారు.

Tags:    

Similar News