రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా’ లేదు: చంద్రబాబు

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్ష పార్టీ నేత ఇంటికి వెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే దాడులు చేయడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి చేయడం క్షీణించిన శాంతిభద్రతలకు ప్రత్యక్ష సాక్షమన్నారు. స్టేట్‌లో ‘రూల్‌ ఆఫ్‌ లా’ లేదనడానికి ఈ ఘటనే ఉదాహారణ అని విమర్శించారు. జేసీ ఇంటికి ఎవరొచ్చారు, ఏం చేశారో సీసీ కెమెరాల్లో రికార్డు […]

Update: 2020-12-29 01:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్ష పార్టీ నేత ఇంటికి వెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యే దాడులు చేయడం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి చేయడం క్షీణించిన శాంతిభద్రతలకు ప్రత్యక్ష సాక్షమన్నారు. స్టేట్‌లో ‘రూల్‌ ఆఫ్‌ లా’ లేదనడానికి ఈ ఘటనే ఉదాహారణ అని విమర్శించారు. జేసీ ఇంటికి ఎవరొచ్చారు, ఏం చేశారో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని, కానీ దాడి చేసిన వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జేసీ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా పోలీసులు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవడం గురించి విన్నామని, కానీ ఇసుక దొంగలు ఎవరంటే ఇళ్లపై దాడులు చేస్తుండటం ఇప్పుడే చూస్తున్నామన్నారు. తాడిపత్రి ఘటనపై సీఎం జగన్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు లేఖ రాసిన చంద్రబాబు.. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

Tags:    

Similar News