గవర్నర్ చర్యతో ఆ ఆర్టికల్‌కు సార్ధకత
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. రాజ్యాంగాన్ని, కోర్టుల ఔనత్యాన్ని ఆయన నెలబెట్టారని చంద్రబాబు ట్వీట్ చేశారు. గవర్నర్ చర్యతో ఆర్టికల్ 243కె(2)కు సార్ధకత ఏర్పండిందన్నారు. ఎస్ఈసీ తొలగింపు విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుందుడుకు చర్యలకు, పెత్తందారీ పోకడలకు […]
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. రాజ్యాంగాన్ని, కోర్టుల ఔనత్యాన్ని ఆయన నెలబెట్టారని చంద్రబాబు ట్వీట్ చేశారు. గవర్నర్ చర్యతో ఆర్టికల్ 243కె(2)కు సార్ధకత ఏర్పండిందన్నారు.
ఎస్ఈసీ తొలగింపు విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి దుందుడుకు చర్యలకు, పెత్తందారీ పోకడలకు స్వస్తి చెప్పాలన్నారు. ఎస్ఈసీ తొలగింపు వెనుక ప్రధాన సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారు.