ఆ మరణాలన్నీ.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే.. చంద్రబాబు

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరద బాధిత కుటుంబాల పరామర్శకు శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట మండలం ఎగువ మందపల్లిలో వరద బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. తంబల్ల చెంగమ్మ, రామ్మూర్తి కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. చెయ్యేరు వరదలో 9 మందిని కోల్పోయిన కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అన్నమయ్య ప్రాజెక్టు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైంది. ముంపు విపత్తుకు స్థానిక […]

Update: 2021-11-23 06:55 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరద బాధిత కుటుంబాల పరామర్శకు శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట మండలం ఎగువ మందపల్లిలో వరద బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. తంబల్ల చెంగమ్మ, రామ్మూర్తి కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు వారికి ధైర్యం చెప్పారు. చెయ్యేరు వరదలో 9 మందిని కోల్పోయిన కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అన్నమయ్య ప్రాజెక్టు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైంది. ముంపు విపత్తుకు స్థానిక ఇసుక మాఫియానే కారణం. మంత్రులు, అధికార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. వరద బాధితుల మరణాలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. ముంచుకొస్తున్న వరద ముప్పు నుంచి ప్రజలను అప్రమత్తం చేయలేని సీఎం ఆ పదవికి అనర్హుడు. చేతకాకపోతే స్వచ్ఛందంగా తప్పుకోవాలి.. కానీ ప్రజల ప్రాణాలతో ఆటలొద్దు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేవరకు పోరాడుతా అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News