నేతన్నల దుస్థితి తలచుకుంటే మనసు కలచివేస్తోంది: చంద్రబాబు

దిశ, ఏపీ బ్యూరో: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత సోదరులకు మాజీ సీఎం చంద్రబాబు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘పోగును వస్త్రంగా మలిచి.. మానవాళికి నాగరికతను నేర్పిన చేనేత సోదరులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో నేతన్నలకు ఎన్నోమేలు చేసే కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అదే సమయంలో నేతన్నలకు ఇచ్చే త్రిఫ్టును 8 నుండి 16% పెంచినట్లు తెలిపారు. […]

Update: 2021-08-07 08:32 GMT

దిశ, ఏపీ బ్యూరో: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత సోదరులకు మాజీ సీఎం చంద్రబాబు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘పోగును వస్త్రంగా మలిచి.. మానవాళికి నాగరికతను నేర్పిన చేనేత సోదరులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో నేతన్నలకు ఎన్నోమేలు చేసే కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అదే సమయంలో నేతన్నలకు ఇచ్చే త్రిఫ్టును 8 నుండి 16% పెంచినట్లు తెలిపారు. నూలుపై సబ్సిడీని 10 నుండి 40%నికి పెంచినట్లు తెలిపారు. చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాల రాయితీ అమలు చేశామని.. పనులు లేని వర్షాకాలానికి భృతి అందించినట్లు గుర్తు చేశారు. 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చినట్లు గుర్తు చేశారు.

అలాగే ఆదరణ కార్యక్రమం పేరుతో పనిముట్లను సైతం అందజేసి నేతన్నలకు అండగా నిలిచామని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం హయాంలో నాటి పరిస్థితుల్ని, వైసీపీ ప్రభుత్వంలో నేతన్నల నేటి దుస్థితిని తలచుకుంటే మనసు కలచివేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో చేనేత కార్మికులకు ఏడాదికి రూ.50వేలకు పైగా వచ్చే రాయితీలను వైసీపీ ప్రభుత్వం రద్దుచేసి రూ.24 వేలతో సర్దుకోమంటూ తీరని ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. నేతన్నల అభివృద్ధిని, అభ్యున్నతిని ఈ ప్రభుత్వం ప్రశ్నార్థ‌కం చేస్తోందని ధ్వజమెత్తారు. నాడు చేనేతలకు స్వర్ణయుగంగా ఉన్న పథకాలను రద్దుచేసి చీకట్లలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం హయాంలో అందించిన ప్రోత్సాహకాలు, రాయితీలు నేతన్నలకు ఇవ్వాలన్నారు. అలాగే కరోనాతో నష్టపోయిన కార్మికులకు పరిహారం కూడా అందజేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News