మేరీ కోమ్ 'బంగారు కల' నెరవేరేనా ?

లండన్ ఒలింపిక్స్ కాంస్య పతాక విజేత మేరీ కోమ్ కెరీర్ చరమాంకానికి చేరుకుంది. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో భారత దేశానికి ఒక పేజి లిఖించిన మేరీ కోమ్ తన ఒలింపిక్ స్వర్ణ పతాక కల కోసం మూడేళ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. ఒలింపిక్స్‌లో బంగారం పతకం గెలవడమే తన లక్ష్యమని మేరీకోమ్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే.అయితే, ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ ఏడాదిపాటు వాయిదా పడటంతో ఈ 37 ఏళ్ల బాక్సర్‌పై మరింత ఒత్తిడి పెరగనుంది. మేరీ కోమ్ […]

Update: 2020-04-01 04:59 GMT

లండన్ ఒలింపిక్స్ కాంస్య పతాక విజేత మేరీ కోమ్ కెరీర్ చరమాంకానికి చేరుకుంది. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో భారత దేశానికి ఒక పేజి లిఖించిన మేరీ కోమ్ తన ఒలింపిక్ స్వర్ణ పతాక కల కోసం మూడేళ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. ఒలింపిక్స్‌లో బంగారం పతకం గెలవడమే తన లక్ష్యమని మేరీకోమ్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే.అయితే, ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ ఏడాదిపాటు వాయిదా పడటంతో ఈ 37 ఏళ్ల బాక్సర్‌పై మరింత ఒత్తిడి పెరగనుంది.

మేరీ కోమ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో 51 కిలోల విభాగంలో కాంస్య పతకం నెగ్గగా, ఆ తర్వాత జరిగిన రియో ఒలింపిక్స్‌కు అసలు అర్హతే సాధించలేకపోయింది. కెరీర్ ప్రారంభం నుంచి 48 కిలోల విభాగంలోనే ఎక్కువగా పోటీ పడిన మేరీ కోమ్.. టోక్య్ 2020 ఒలంపిక్స్‌లోనూ అదే విభాగంలో పోటీ పడాలని భావించింది. అయితే నిర్వాహకులు టోక్యో ఒలింపిక్స్ నుంచి 48 కేజీల విభాగాన్ని తీసేయడంతో ఆమె తిరిగి 51 కిలోలకు మారింది. కానీ ఆ విభాగంలో ఒలింపిక్స్ బెర్త్ కోసం ఇప్పటికే తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ పోటీ పడుతోంది. మేరీకోమ్ తన కేటగిరీ మార్చుకోవడంపై నిఖత్ అభ్యంతరం తెలిపింది. దీంతో వారిద్దరి మధ్య ట్రయల్స్ నిర్వహించారు. ఆ ఫైట్‌లో నిఖత్‌పై మేరీ కోమ్ విజయం సాధించడంతో టోక్యో ఒలింపిక్స్‌కు మార్గం సుగమమైంది.

కాగా, కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఒలింపిక్స్ ఏడాది పాటు వాయిదా వేయడంతో.. మేరీ కోమ్‌పై ఒత్తిడి పెరిగింది.

ఓ వైపు వయసుపైబడటం, మరోవైపు ఏడాది పాటు ఫిట్‌నెస్ కాపాడుకోవడంతో పాటు గేమ్‌ను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మేరీకోమ్‌కు లభించినట్లే ఇతర బాక్సర్లకు ఏడాది పాటు అవకాశం ఉంది. దీంతో ఎవరికి వారు తమ ఆటను మెరుగుపరుచుకునే పనిలో ఉంటారు. కానీ మేరీకోమ్‌కు ఇప్పుడు కాకపోతే భవిష్యత్‌లో పతకం సాధించే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఆమె కల నెరవేర్చుకోవడానికి తీవ్రమైన సాధనే చేయాల్సి ఉంది.

Tags: Mary kom, Boxer, Olympics, Nikhat Zareen, Gold Medal

Tags:    

Similar News