తుఫాను బలపడుతోంది.. ఏపీలో ప్రభావం కనిపిస్తుంది
దిశ, వెబ్ డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గంటగంటకూ మరింతగా బలపడుతోంది. దీంతో బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో నేటి సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది రేపు వాయవ్య దిశకు కదులుతూ 18, 20వ తేదీల్లో ఈశాన్య బంగాళాఖాతం వైపు పయనిస్తుందని వాతావరణ విభాగం అంచనా వేస్తోన్నది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు […]
దిశ, వెబ్ డెస్క్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గంటగంటకూ మరింతగా బలపడుతోంది. దీంతో బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో నేటి సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది రేపు వాయవ్య దిశకు కదులుతూ 18, 20వ తేదీల్లో ఈశాన్య బంగాళాఖాతం వైపు పయనిస్తుందని వాతావరణ విభాగం అంచనా వేస్తోన్నది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల భారీ వర్షాలకూ ఆస్కారం ఉందని వాతావరణ శాఖాధికారులు చెప్పారు.
అలాగే, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. నేటి నుంచి మూడు రోజులపాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.