ఏపీకి భారీ వర్షసూచన

దిశ, వెబ్‌డెస్క్: ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో నేడు, రేపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని, కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అరేబియా సముద్రం వైపు నుంచి వీస్తున్న పశ్చిమ, నైరుతి గాలుల ప్రభావం రాష్ట్రంపై ఉన్నట్లు వాతావరణశాఖ స్పష్టం […]

Update: 2021-08-22 22:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో నేడు, రేపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశముందని, కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ వెల్లడించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అరేబియా సముద్రం వైపు నుంచి వీస్తున్న పశ్చిమ, నైరుతి గాలుల ప్రభావం రాష్ట్రంపై ఉన్నట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది.

Tags:    

Similar News