Vizianagaram: ఏనుగుల గుంపు బీభత్సం.. ప్రజలకు బిగ్ అలర్ట్

విజయనగరం జిల్లా కురుపాం మండలం జీరడలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి....

Update: 2024-09-26 15:26 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా(Vizianagaram District) కురుపాం మండలం జీరడలో ఏనుగులు (Elephants) బీభత్సం సృష్టించాయి. పంటపొలాల్ని ధ్వంసం చేశాయి. స్థానిక చెరువు ప్రాంతంలో తిష్టవేశాయి. చెరువు(Pond)లో జలకాలాడుతూ కనిపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యాయి. అటవీ శాఖ అధికారుల(Forest Department officials)కు సమాచారం అందజేశారు. ఏనుగుల గుంపు ఎప్పుడు తమ గ్రామంలోకి అడుగు పెడతాయోనని స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతం(Forest Area)లోకి తరిమివేయాలని కోరారు. అయితే ఏనుగుల సంచారం నేపథ్యంలో గ్రామస్తులకు అలర్ట్ ప్రకటించారు. ఒంటరిగా చెరువువైపు వెళ్లొద్దని, రైతులు పొలాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరిమే వరకూ చిన్న పిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు తెలిపారు. 


Similar News