వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన వెంకయనాయుడు

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం ఏర్పాటు చేశారు.

Update: 2024-09-26 15:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ (Valmiki Research Centre)ను ఏర్పాటు చేశారు. దీనిని గురువారం సాయంత్రం భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Former Vice President Venkaiah Naidu) ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. వాల్మీకి రీసెర్చ్ సెంటర్ (Valmiki Research Centre)ను జాతికి అంకితం చేయాలన్నారు. అలాగే రామాయణ స్పూర్తిని భావి తరాలకు అందించడం సంతోషమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం.. కొందరు సెక్యులర్ పేరు చెబుతున్నారని, రామాయణం పిల్లల పాఠ్యపుస్తకాల్లో ఉండాలని వెంకయ్య నాయుడు తన అభిప్రాయాన్ని తెలిపారు. కాగా ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే రామనారాయణం లో ఏర్పాటు చేసిన వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను గతంలో మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన విషయం తెలిసిందే. రామనారాయణంలో ప్రారంభం అయిన ఈ వాల్మీకి రిసెర్చ్ సెంటర్‌ను జాతీయ సంస్కృత యూనివర్శిటితో అనుసంధానం చేశారు.


Similar News