కరోనా నివారణకు అన్నదమ్ముల చేయూత

దిశ, కరీంనగర్: తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తాము భాగస్వామ్యులమవుతామని చల్ల్మెడ బ్రదర్స్ ముందుకు వచ్చారు. మాజీ మంత్రి ఆనందరావు తనయులుగా వీరు జిల్లాల్లో అందరికి సుపరిచితమే. ఒకరు వైద్య రంగం, మరోకరు ఫీడ్ ఉత్పత్తిలో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే కరోనా బాధితులను ఆదుకునేందుకు చల్మెడ ఫీడ్స్ మేనేజింగ్ డైరక్టర్ వెంకటేశ్వర్ రావు రూ.10 లక్షలను సీఎంఆర్ఎఫ్‌కు విరాళం ప్రకటించారు. సోమవారం కరీంనగర్ కలెక్టర్ శశాంకాను కలిసి చెక్కును అందజేశారు. ఆయన […]

Update: 2020-03-30 07:53 GMT

దిశ, కరీంనగర్: తెలంగాణలో విస్తరిస్తున్న కరోనా వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తాము భాగస్వామ్యులమవుతామని చల్ల్మెడ బ్రదర్స్ ముందుకు వచ్చారు. మాజీ మంత్రి ఆనందరావు తనయులుగా వీరు జిల్లాల్లో అందరికి సుపరిచితమే. ఒకరు వైద్య రంగం, మరోకరు ఫీడ్ ఉత్పత్తిలో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే కరోనా బాధితులను ఆదుకునేందుకు

చల్మెడ ఫీడ్స్ మేనేజింగ్ డైరక్టర్ వెంకటేశ్వర్ రావు రూ.10 లక్షలను సీఎంఆర్ఎఫ్‌కు విరాళం ప్రకటించారు. సోమవారం కరీంనగర్ కలెక్టర్ శశాంకాను కలిసి చెక్కును అందజేశారు. ఆయన సోదరుడు లక్ష్మీనరసింహరావు చల్మెడ ఆనందరావు ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (కెయిమ్స్)లో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయించారు. తమవంతు బాధ్యతగా కరోనా వ్యాధిగ్రస్థులకు సేవలందించడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటామని వివరించారు. ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం కోరగానే లక్ష్మీనరసింహరావు అందకు అంగీకరించి వార్డును తయారు చేయించారు. అంతేకాకుండా విమలా ఫీడ్స్ తరఫున రూ.25 లక్షల చెక్కును ఇదివరకే మంత్రి కేటీఆర్ కు అందజేశారు.

Tags : corona, rs 10 lakhs donation, cmrf, karimnagar, chalmeda brothers

Tags:    

Similar News