పీఎస్ఎల్వీ-50 సత్తా చాటింది : శివన్

దిశ, వెబ్‌డెస్క్: శ్రీహరికోటలో పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. సీఎంఎస్ -01 శాటిలైట్‌ రాకెట్‌ నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్లింది. అనంతరం ఇస్రో చైర్మెన్ శివన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ పీఎస్ఎల్వీ సిరీస్‌లో 50 ప్రయోగాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. దేశీయ అవసరాలతో పాటు కమర్షియల్ ప్రయోగాల్లో పీఎస్‌ఎల్వీ సత్తా చాటిందని అన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు శివన్ అభినందనలు తెలియజేశారు. కరోనా వల్ల తక్కువమంది శాస్త్రవేత్తలతో ప్రయోగం పూర్తి చేశామని వెల్లడించారు. పీఎస్ఎల్వీ-50 […]

Update: 2020-12-17 06:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీహరికోటలో పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. సీఎంఎస్ -01 శాటిలైట్‌ రాకెట్‌ నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్లింది. అనంతరం ఇస్రో చైర్మెన్ శివన్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ పీఎస్ఎల్వీ సిరీస్‌లో 50 ప్రయోగాలు విజయవంతం అయ్యాయని తెలిపారు. దేశీయ అవసరాలతో పాటు కమర్షియల్ ప్రయోగాల్లో పీఎస్‌ఎల్వీ సత్తా చాటిందని అన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు శివన్ అభినందనలు తెలియజేశారు. కరోనా వల్ల తక్కువమంది శాస్త్రవేత్తలతో ప్రయోగం పూర్తి చేశామని వెల్లడించారు. పీఎస్ఎల్వీ-50 ప్రయోగం ఇస్రోకి చాలా ప్రత్యేకమైనదని అభిప్రాయపడ్డారు. ఎక్సెల్ ఇండియా పేరుతో ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రయోగించామని అన్నారు. ఆనంద్ అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నామని, యువ భారతానికి ఇదో కీలకమైన ఘట్టంగా నిలవనుందని అన్నారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌తో కొత్త శఖానికి నాంది పలుకుతుందని తెలిపారు. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్1, గగన్ యాన్ పనులు ముమ్మరం చేశామన్నారు.

Tags:    

Similar News