‘నియంత్రిత వ్యవసాయం పేరుతో నియంతృత్వం’

దిశ, న్యూస్‌బ్యూరో: యాసంగి సీజన్‌లోని రైతుబంధు బకాయి డబ్బులు రైతులకు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటకు మద్దతు ధర ఇచ్చామని మురిసిపోవడం కాదు.. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్లు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా చాడ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. వానాకాలనికి సంబంధించి పది రోజుల్లో రైతులందరికీ రైతు బంధు ఇస్తామన్న సీఎం కేసీఆర్ పాత బకాయిల విషయంపై నిర్ణయం తీసుకోవాలని […]

Update: 2020-06-16 11:29 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: యాసంగి సీజన్‌లోని రైతుబంధు బకాయి డబ్బులు రైతులకు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటకు మద్దతు ధర ఇచ్చామని మురిసిపోవడం కాదు.. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్లు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా చాడ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. వానాకాలనికి సంబంధించి పది రోజుల్లో రైతులందరికీ రైతు బంధు ఇస్తామన్న సీఎం కేసీఆర్ పాత బకాయిల విషయంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు సకాలంలో రైతుల ఖాతాలో నగదు జమ చేసిన ప్రభుత్వం, ఎన్నికలు ముగిసిన తర్వాత ఐదెకరాలకు ఎక్కువగా ఉన్న రైతులకు రైతుబంధు ఇవ్వలేదని విమర్శించారు. చిగురుమామిడి గ్రామంలో 9896మంది రైతులకు గాను 8036మంది రైతులకు మాత్రమే రైతుబంధు డబ్బులు ఇచ్చారని తెలిపారు. 900మంది రైతులకు నేటికీ డబ్బులు రాలేదన్నారు.
నియంత్రిత వ్యవసాయం పేరుతో నియంతృత్వ వ్యవసాయానికి బాటలు వేస్తున్నారని చాడ విమర్శించారు. ఏ భూమిలో ఏ పంట వేయాలో ప్రభుత్వం సూచనలు, సలహాలతో పాటు రైతుల అనుభవాన్ని క్రోడీకరించాలన్నారు. మూడు నెలల పాటు కిరాయి అడగొద్దన్న కేసీఆర్ మూడు నెలల విద్యుత్ బిల్లులు ఒకేసారి వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తే వడ్డీలు వసూలు చేస్తామనడం సరికాదన్నారు. మూడు నెలల బిల్లు ఒకే సారి ఇవ్వడంతో స్లాబులు మారి ప్రజలపై భారం పడిందని తక్షణమే దానిని తగ్గించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News