రెమ్‌డెసివర్ డ్రగ్ డోసేజీని సవరించిన కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా తీవ్రత మధ్యస్థంగా ఉన్న పేషెంట్లకు అత్యవసర పరిస్థితుల్లో అందించేందుకు అనుమతి పొందిన రెమ్‌డెసివిర్ డ్రగ్ డోసేజీని కేంద్ర ప్రభుత్వం సవరించింది. తొలి ఆరు రోజుల్లో ఈ డ్రగ్ ఇచ్చే డోసేజీని సవరించింది. ఈ సవరణ ప్రకారం, ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఈ డ్రగ్ కరోనా పేషెంట్‌కు తొలి రోజు 200 మిల్లిగ్రాములు ఇవ్వాలని, తర్వాతి నాలుగు రోజులు 100 మిల్లిగ్రామలు చొప్పున ఇవ్వాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో రెమ్‌డెసివిర్‌ను కరోనా పేషెంట్లకు ఇవ్వడానికి గతనెల […]
న్యూఢిల్లీ: కరోనా తీవ్రత మధ్యస్థంగా ఉన్న పేషెంట్లకు అత్యవసర పరిస్థితుల్లో అందించేందుకు అనుమతి పొందిన రెమ్‌డెసివిర్ డ్రగ్ డోసేజీని కేంద్ర ప్రభుత్వం సవరించింది. తొలి ఆరు రోజుల్లో ఈ డ్రగ్ ఇచ్చే డోసేజీని సవరించింది. ఈ సవరణ ప్రకారం, ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఈ డ్రగ్ కరోనా పేషెంట్‌కు తొలి రోజు 200 మిల్లిగ్రాములు ఇవ్వాలని, తర్వాతి నాలుగు రోజులు 100 మిల్లిగ్రామలు చొప్పున ఇవ్వాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో రెమ్‌డెసివిర్‌ను కరోనా పేషెంట్లకు ఇవ్వడానికి గతనెల 13న కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతినిచ్చింది. కరోనా తీవ్రంగా ఉన్న పేషెంట్లకు, గర్భిణులకు, తీవ్ర కిడ్నీ సమస్య, లివర్ ఎంజైమ్‌లు తీవ్రస్థాయిలో ఉండేవారికి, 12 ఏళ్లలోపు పిల్లలకు ఈ డ్రగ్ ఇవ్వరాదని తెలిపింది.