ఏపీపై సవతి తల్లి ప్రేమ సరికాదు: సుభాష్ చంద్రబోస్

దిశ, ఏపీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఏపీపై సవతి తల్లి ప్రేమ చూపుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విమర్శించారు. న్యూఢిల్లీలో పార్లమెంట్‌ ఆవరణలో గురువారం  ఎంపీలు చింతా అనురాధా, వంగాగీతతో కలిసి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లను సీఎం వైఎస్ జగన్ , వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పలుమార్లు కలిసి విజ్ఞప్తి […]

Update: 2021-12-09 03:35 GMT

దిశ, ఏపీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ఏపీపై సవతి తల్లి ప్రేమ చూపుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ విమర్శించారు. న్యూఢిల్లీలో పార్లమెంట్‌ ఆవరణలో గురువారం ఎంపీలు చింతా అనురాధా, వంగాగీతతో కలిసి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లను సీఎం వైఎస్ జగన్ , వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారని, అయినప్పటికీ పోలవరం విషయంలో ఇంకా పెండింగ్‌ పెడుతున్నారని ఆరోపించారు. ఏపీ పట్ల ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశంలో ఇతర జాతీయ ప్రాజెక్టులకు ఒకలా.. పోలవరం ప్రాజెక్టు పట్ల మరోలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పవర్‌ ప్రాజెక్టుల పట్ల కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు బాధాకరంగా ఉన్నాయన్నారు. తాగునీటి వాటర్‌ కంపొనెంట్‌ను వేరు చేస్తూ పార్లమెంట్‌లో జీవో విడుదల చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ జీవోపై ప్రధాని, జలశక్తి మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. పోలవరం రివర్స్‌కాస్ట్‌ ఎస్టిమేషన్లు విడుదల చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి సీఎం జగన్ పలుమార్లు లేఖలు సైతం రాశారని కానీ వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పోలవరం బకాయిలను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని.. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ హెడ్‌క్వార్టర్స్‌‌ను రాజమండ్రికి తరలించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్రాజెక్టు గురించి కేంద్రం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, కానీ గిరిజనులకు పరిహారం ఇవ్వకుండా నీరు ఇవ్వడం అసాధ్యమని అన్నారు. అందువల్ల ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ నిరుపేదలైన గిరిజనులకు ఇచ్చే విషయంలో అశ్రద్ధ చూపడం భావ్యం కాదన్నారు. మరోవైపు ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్రం పునరాలోచన చేయాలని అన్నారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల చిరకాల కోరిక అన్న సుభాష్ చంద్రబోస్.. రాష్ట్ర విభజన సమయంలో ప్రధాని పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

‘ఏపీలో జగనన్న రౌడీ మామూళ్లు’.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

Tags:    

Similar News