66 కోట్ల వ్యాక్సిన్ డోసులకు కేంద్రం ఆర్డర్..

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత నెలకొంది. వ్యాక్సిన్ కొరతను అధిగమించి వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచాలనే యోచనలో కేంద్రప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా 66 కోట్ల వ్యాక్సిన్ డోసులకు కేంద్రం ఆర్డర్ చేసింది. వీటిలో 37.5 కోట్ల కొవిషీల్డ్ 28.5 కోట్ల కొవాగ్జిన్ డోసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ డోసులు ఆగస్టు- డిసెంబర్ మధ్య సరఫరా అవుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా, […]

Update: 2021-07-17 07:04 GMT

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత నెలకొంది. వ్యాక్సిన్ కొరతను అధిగమించి వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచాలనే యోచనలో కేంద్రప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా 66 కోట్ల వ్యాక్సిన్ డోసులకు కేంద్రం ఆర్డర్ చేసింది. వీటిలో 37.5 కోట్ల కొవిషీల్డ్ 28.5 కోట్ల కొవాగ్జిన్ డోసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ డోసులు ఆగస్టు- డిసెంబర్ మధ్య సరఫరా అవుతాయని అధికారులు చెబుతున్నారు.

కాగా, గతంలో కేంద్రం రూ.150లకు ఒక డోసు చొప్పున కొనుగోలు చేసేది. కానీ కొవిడ్-19 వ్యాక్సిన్ సేకరణ నూతన పాలసీ అమలులోకి వచ్చినప్పటి నుంచి వ్యాక్సిన్ ధరలు రివైజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ డోసుల్లో 75శాతాన్ని కేంద్రం సేకరిస్తుంది.

Tags:    

Similar News