తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల వివాదంపై కేంద్రం స్పందన

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిల వివాదంలో వడ్డీ చెల్లింపులోనే చిక్కులున్నాయని, రెండు రాష్ట్రాలూ సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సూచించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత వాటి మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా జరిగిందని, సుమారు రూ. 6,118 కోట్ల మేర బకాయిని తెలంగాణ చెల్లించాల్సి ఉన్నదని వివరించారు. […]

Update: 2021-12-21 11:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిల వివాదంలో వడ్డీ చెల్లింపులోనే చిక్కులున్నాయని, రెండు రాష్ట్రాలూ సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సూచించారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత వాటి మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా జరిగిందని, సుమారు రూ. 6,118 కోట్ల మేర బకాయిని తెలంగాణ చెల్లించాల్సి ఉన్నదని వివరించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ, ఆంధ్రప్రదేశ్ నుంచి జూలై నెలలో ఫిర్యాదు రావడంతో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో చర్చించామని, రాష్ట్ర విభజనతో ఏర్పడిన వివాదమని పేర్కొన్నారు.

విద్యుత్‌ను కొనుగోలు చేసినందుకు తెలంగాణ రాష్ట్రం తొలి నాళ్ళలో సమయానుగుణంగానే బకాయిలు చెల్లించిందని, ఆ తర్వాత బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. విద్యుత్ వినియోగానికి అయిన ‘అసలు’ మొత్తాన్ని చెల్లించడానికి తెలంగాణకు ఇబ్బంది లేదని, కానీ వడ్డీ దగ్గరే రెండు రాష్ట్రాలకు భిన్నాభిప్రాయం ఉన్నదన్నారు. రెండు రాష్ట్రాలూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు అనుగుణంగా సంయమనంతో పరిష్కరించుకోవడానికి అంగీకరించాయని తెలిపారు. తెలంగాణ నుంచి ఆ మేరకు చెల్లింపులు లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిందని, ప్రస్తుతం అది విచారణలో ఉన్నదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలో సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలని సూచించారు.

Tags:    

Similar News