Seethakka: బీఆర్ఎస్ హయాం నాటి బిల్లు.. ఆమోదం కోసం గవర్నర్ వద్దకు సీతక్క

బీఆర్ఎస్ హయాంలో నాటి బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని మంత్రి సీతక్క గవర్నర్ ను కలిశారు.

Update: 2024-09-24 06:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ములుగును మున్సిపాలిటీ గా మార్చే బిల్లుకు ఆమోదం తెలిపాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ తో సీతక్క భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాటడ్లాడిన సీతక్క.. ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ 2022 గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు చెసిందని ఆ బిల్లును గత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చాలా కాలంగా పెండింగ్ లో పెట్టారని అన్నారు. అయితే దీనిపై ఎంక్వయిరీ చేస్తే మిగతా నాలుగైదు బిల్లులతో పాటు ములుగు మున్సిపాలిటీ బిల్లును కలిపి పంపడంతో పెడింగ్ లో పెట్టారని ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు పంపించారని తెలిసిందన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ బిల్లును ఆమోద ముద్ర వేసి ములుగును మున్సిపాలిటీగా మార్చాలని తాజాగా గవర్నర్ కు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందిచి తొందరలోనే వెరిఫై చేసి పరిష్కరిస్తానని చెప్పారన్నారు. అలాగే జైనూర్ ఘటనపై వివరాలను గవర్నర్ ఆరా తీశారన్నారు. ఆదివాసీ ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు త్వరలో ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించాలని గవర్నర్ ను కోరామని, జిల్లాల పర్యటనకు గవర్నర్ వస్తానని చెప్పారన్నారు.


Similar News