HYD: ఏకకాలంలో 8 చోట్ల ఐటీ దాడులు

గత కొంతకాలంగా గ్యాప్ ఇచ్చిన ఐటీ అధికారులు హైదరాబాద్ నగరంలో మరోసారి దాడులు చేపట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా 8 చోట్ల ఐటీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు.

Update: 2024-09-24 05:54 GMT

దిశ, శేరిలింగంపల్లి: గత కొంతకాలంగా గ్యాప్ ఇచ్చిన ఐటీ అధికారులు హైదరాబాద్ నగరంలో మరోసారి దాడులు చేపట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా 8 చోట్ల ఐటీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. ఈ ఉదయం కూకట్‌పల్లి రెయిన్ బో విస్టా, మాదాపూర్, బషీర్ బాగ్‌లోని ఓ ఫైనాన్స్ కంపెనీతో పాటు పలుచోట్ల ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ యజమానీ, ఓ న్యూస్ చానల్ ఎండీ ఇంట్లో తెల్లవారుజాము నుండే ఈ సోదాలు సాగుతున్నాయి. బషీర్ బాగ్‌లోని పైగా ప్లాజాలోని 2, 3, 4 అంతస్తులో ఐటీ అధికారులు లోపలికి మీడియాని అనుమతించకుండా భారీ ఎత్తున సోదాలు చేస్తున్నారు.


Similar News