పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యను సన్మానించిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం సూరారం గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర మొగులయ్యను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
దిశ,అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం సూరారం గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర మొగులయ్యను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆయన సతీమణి సిబిఎం ట్రస్ట్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ డాక్టర్ అనురాధ దంపతులు హైదరాబాద్ లో తన నివాసంలో సన్మానించి నూతన వస్త్రాలతో పాటు కొంత ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మొగులయ్య గల ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసిన కొన్ని అనివార్య కారణాలవల్ల అది నిలిచిపోయిందని, గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కేటాయింపు విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పటికి ఇంటి స్థలం కేటాయింపు జరగలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో పెన్షన్ పునరుద్ధరణతో పాటు ఇంటి స్థల కేటాయింపులు పూర్తిగా కృషిచేసి మంజూరు అయ్యేలా తన వంతు సహకారం ఉంటుందని పద్మశ్రీ అవార్డు గ్రహీతకు హామీ ఇచ్చారు. ఈ విషయంపై సెక్రటేరియట్‌లో స్వయంగా వెళ్లి పెన్షన్ ఆగిపోవడానికి గల కారణాలు తెలుసుకొని పరిశీలించి తప్పక అందేలా చర్యలు తీసుకుంటారన్నారు. అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు పాత్రికేయులు చందు నాయక్ తదితరులు ఉన్నారు.