‘కేంబ్రిడ్జి అనల్టికా’తో మీరు కుమ్మక్కు కాలేదా : రవిశంకర్
దిశ, వెబ్‌డెస్క్ : ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు ఆపరేట్ చేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫైర్ అయ్యారు.నాడు ఎన్నికలకు ముందు కేంబ్రిడ్జి అనల్టికా, ఫేస్‌బుక్‌తో మీ పార్టీ కుమ్మక్కై డాటాను ఉపయోగించుకోవడం అందరికీ తెలుసని గుర్తుచేశారు. అదే పనిని తాము ఇప్పుడు చేశామంటూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. అంతేకాకుండా, ‘పరాజితులు ఎన్నడూ ప్రజావిశ్వాసం చూరగొనలేరు. ఎన్నికలకు ముందు డాటా కోసం కేంబ్రిడ్జి అనల్టికా, […]
దిశ, వెబ్‌డెస్క్ :
ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు ఆపరేట్ చేస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫైర్ అయ్యారు.నాడు ఎన్నికలకు ముందు కేంబ్రిడ్జి అనల్టికా, ఫేస్‌బుక్‌తో మీ పార్టీ కుమ్మక్కై డాటాను ఉపయోగించుకోవడం అందరికీ తెలుసని గుర్తుచేశారు. అదే పనిని తాము ఇప్పుడు చేశామంటూ బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు.
అంతేకాకుండా, ‘పరాజితులు ఎన్నడూ ప్రజావిశ్వాసం చూరగొనలేరు. ఎన్నికలకు ముందు డాటా కోసం కేంబ్రిడ్జి అనల్టికా, ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన వారు ఇప్పుడు మామీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు’ అంటూ రాహుల్‌ను పరోక్షంగా విమర్శించారు. వాస్తవానికి సమాచార వ్యవస్థ, భావప్రకటనా స్వేచ్ఛ ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతోందని, గాంధీ ఫ్యామిలీ గుప్పిట్లో ఇవి లేకపోవడంతో వారికి మనస్తాపంగా ఉందని పేర్కొన్నారు.
ప్రతి విషయంలో స్పందించే కాంగ్రెస్ పార్టీ బెంగళూరు అల్లర్లపై ఎందుకు మాట్లాడలేదు..ఆ ఘటనను మీరు ఎందుకు ఖండించడం లేదని? ఇప్పుడు మీ ధైర్యం ఎక్కడ పోయిందని? రవిశంకర్ రాహుల్ గాంధీకి రీకౌంటర్ ఇచ్చారు.