రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : రాజ్‌నాథ్‌సింగ్

న్యూఢిల్లీ : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళలను రైతులు త్వరలో విరమిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ జయంతి పురస్కరించుకుని బుధవారం ‘కిసాన్ దివస్’ నిర్వహించారు. చౌధరి చరణ్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ రైతుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో […]

Update: 2020-12-23 07:20 GMT

న్యూఢిల్లీ : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళలను రైతులు త్వరలో విరమిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ జయంతి పురస్కరించుకుని బుధవారం ‘కిసాన్ దివస్’ నిర్వహించారు. చౌధరి చరణ్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ రైతుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు చేపట్టారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అన్నదాతలకు నష్టం వాటిల్లే చర్యలను ఆయన అనుమతించరని పేర్కొన్నారు. ‘వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొంత మంది రైతులు ఆందోళనలు చేస్తున్నారు. సున్నితమైన అంశం కావడంతో వారితో ప్రభుత్వం చర్చలు జరుపుతున్నది. అతి త్వరలో ఆందోళనలను రైతులు విరమిస్తారని నమ్మకం ఉంది’ అని రాజ్‌నాథ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ఒకపూట భోజనం మానండి : రైతు సంఘాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం కిసాన్ దివస్ పురస్కరించుకొని కొంత మంది రైతులు కిసాన్ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పించారు. ఘాజీపూర్ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు హోమం నిర్వహించారు. కిసాన్ దివస్ పురస్కరించుకుని తమ ఆందోళనలకు మద్దతుగా ఒకపూట భోజనం చేయవద్దని ప్రజలను రైతు సంఘాలు కోరాయి.

Tags:    

Similar News