మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్..

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, సెలెబ్రిటీలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరికొందరు చికిత్స అనంతరం రికవరీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మరో కేంద్ర మంత్రికి తాజాగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. తనకు ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ వచ్చిందని సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా […]

Update: 2020-10-07 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు, సెలెబ్రిటీలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరికొందరు చికిత్స అనంతరం రికవరీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మరో కేంద్ర మంత్రికి తాజాగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. తనకు ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ వచ్చిందని సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా తనతో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్నవారు కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News