పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో చమురు ధరలు వరుసగా పెరుగుతుండటంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరల పెరుగుదల సమస్యగానే ఉందని, ఈ విషయంపై ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్నామని తెలిపారు. విపత్కర సమయంలో కేంద్రం వ్యాక్సినేషన్ కోసం రూ.35వేల కోట్లను ఖర్చు చేస్తోందని గుర్తుచేశారు. అంతేకాకుండా కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్ వలన పనులు లేక ఇబ్బందులు పడేవారికి, ఇతర ప్రజల కోసం సంక్షేమ పథకాలు అందించేందుకు నిధులు కేటాయిస్తున్నామని […]

Update: 2021-06-13 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో చమురు ధరలు వరుసగా పెరుగుతుండటంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరల పెరుగుదల సమస్యగానే ఉందని, ఈ విషయంపై ప్రజల ఆవేదనను అర్థం చేసుకున్నామని తెలిపారు. విపత్కర సమయంలో కేంద్రం వ్యాక్సినేషన్ కోసం రూ.35వేల కోట్లను ఖర్చు చేస్తోందని గుర్తుచేశారు. అంతేకాకుండా కరోనా సమయంలో విధించిన లాక్‌డౌన్ వలన పనులు లేక ఇబ్బందులు పడేవారికి, ఇతర ప్రజల కోసం సంక్షేమ పథకాలు అందించేందుకు నిధులు కేటాయిస్తున్నామని వివరించారు.

ముఖ్యంగా సంక్షేమ పథకాల కోసమే డబ్బు ఆదా చేస్తున్నట్లు.. అందుకోసమే చమురు ధరలపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోలేక పోతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయాలను అర్థం చేసుకోకుండా ప్రతీసారి విమర్శించే కాంగ్రెస్ పార్టీ, వారు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలపై రాహుల్ గాంధీ మాట్లాడాలని ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. మహారాష్ట్రలో పన్నులు తగ్గించాలని రాహుల్ గాంధీ చెప్తారా..? అని అడిగారు.

Tags:    

Similar News