4 కోట్ల మందికి కరోనా పరీక్షలు

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో రికవరీ రేటు కూడా దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ మీడియాతో మాట్లాడారు. వైరస్ పట్ల ప్రజల్లో భయం లేకుండా పోయిందన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు పెరుగుతున్నా.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు 4 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. మరణాల రేటు కూడా ప్రపంచంలోనే […]

Update: 2020-08-29 04:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో రికవరీ రేటు కూడా దేశవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ మీడియాతో మాట్లాడారు. వైరస్ పట్ల ప్రజల్లో భయం లేకుండా పోయిందన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు పెరుగుతున్నా.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు 4 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. మరణాల రేటు కూడా ప్రపంచంలోనే అతి తక్కువగా 1.82 శాతం ఉందని హర్షవర్ధన్ తెలిపారు.

Tags:    

Similar News